Murder Accused: హత్య కేసు నిందితుడికి పోలీస్ స్టేషన్ లో బర్త్ డే వేడుకలు నిర్వహించిన ఎస్సై

SI celebrated murder accused birthday celebrations in police station
  • హత్య కేసులో నిందితుడిగా ఉన్న మహేందర్ గౌడ్
  • తెలంగాణలోని మొగుళ్లపల్లి పీఎస్ లో బర్త్ డే సెలెబ్రేషన్స్
  • ఫొటోలను చూసి షాక్ అవుతున్న జనాలు
హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి పుట్టిన రోజును నిర్వహించేందుకు ఒక ఎస్సై పోలీస్ స్టేషన్ నే వాడేశాడు. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి పీఎస్ లో ఆ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఒక మర్డర్ కేసులో వేముల మహేందర్ గౌడ్ నిందితుడిగా ఉన్నాడు. ఆయన పుట్టినరోజు వేడుకలను మొగుళ్లపల్లి పీఎస్ ఎస్సై తీగల వేణుమాధవ్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలను చూసిన జనాలు షాక్ కు గురవుతున్నారు. ఎస్సై తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Murder Accused
policce station
Telangana
birthday celebrations

More Telugu News