Revenue Day: ఏపీలో ఇకపై ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవం

  • స్వాతంత్ర్యం రాకముందు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు
  • 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ఏర్పాటు
  • నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
AP Govt declares June 20 as Revenue Day

ప్రతి ఏటా జూన్ 20న రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజున మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది. 

ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు, భూ వ్యవహారాలు, వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు, నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. పదవీ విరమణ చేసిన రెవెన్యూ ఉద్యోగులను ఆ రోజున సన్మానించుకోవాలని సూచించింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ (జీవో ఎంఎస్ నెం.81) విడుదల చేసింది. 

దేశానికి స్వాతంత్ర్యం రాక ముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786 జూన్ 20న రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆ బోర్డు ఏర్పాటైంది జూన్ 20వ తేదీన. ఇప్పుడు 238 ఏళ్ల తర్వాత ఏపీలో రెవెన్యూ డే ప్రకటించడం విశేషం.

More Telugu News