Family Star: విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' టీజర్ విడుదల

Vijay Devarakonda Family Star teaser out now
  • విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా ఫ్యామిలీ స్టార్
  • పరశురాం దర్శకత్వంలో చిత్రం
  • ఏప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఫ్యామిలీ స్టార్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పరశురాం కాంబినేషన్లో గీతగోవిందం చిత్రం తర్వాత వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇంట్రో సాంగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో టీజర్ ను రూపొందించారు. "దేఖోరే దేఖోరే దేఖోరే దేఖో... కలియుగ రాముడు అచ్చిండు కాకో" అంటూ సాగే పాట విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ను వివరిస్తుంది. 

ఫ్యామిలీ స్టార్ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ కథానాయిక. టీజర్ లో ఇద్దరి మధ్య వచ్చే ఓ ఇంట్రెస్టింగ్ బస్టాండ్ సీన్ ను కూడా పంచుకున్నారు. "ఏమండీ... నేను కాలేజీకి వెళ్లాలి... కొంచెం దించేస్తారా?" అని మృణాల్ ఠాకూర్ అడగ్గా... "ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా" అని విజయ్ సమాధానమివ్వడం టీజర్ లో చూడొచ్చు. 

ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News