BJP: తమిళనాడులో 5, కేరళలో 3 సీట్లు గెలుచుకోనున్న బీజేపీ... ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే

  • తమిళనాడు, కేరళలో గతంలో ఒక్క సీటూ గెలుచుకోని బీజేపీ
  • కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ 22 సీట్లలో బీజేపీ గెలిచే అవకాశం
  • ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ పార్టీలు సున్నాకే పరిమితం
  • దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం
BJP may win 3 seats in Kerala in big shock

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోనుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడులో బీజేపీ గతంలో కంటే మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. కర్ణాటకలో 22 సీట్లు గెలుచుకునే అవకాశముంది.

బీజేపీ కేరళ, తమిళనాడులో గతంలో ఒక్క సీటూ గెలుచుకోలేదు. కానీ 2024 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో ఐదు, కేరళలో మూడు సీట్లు గెలుచుకునే అవకాశముందని ఈ సర్వే వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22కు పరిమితమయ్యే అవకాశముందని విశ్లేషించింది. తెలంగాణలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని సీట్లు?

కేరళలో మొత్తం సీట్లు: 20
యూడీఎఫ్: 11
ఎల్డీఎఫ్: 06
బీజేపీ: 03

తమిళనాడులో మొత్తం సీట్లు: 40
డీఎంకే: 20
కాంగ్రెస్: 06
బీజేపీ: 05
అన్నాడీఎంకే: 04
ఇతరులు: 05

కర్ణాటకలో మొత్తం సీట్లు: 28
బీజేపీ: 22
కాంగ్రెస్: 04
జేడీఎస్: 02

More Telugu News