BCCI Central Contracts: బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ప్రమోట్ అయిన ఆటగాళ్లు వీళ్లే.. ముగ్గురికి రూ.5 కోట్ల వార్షిక వేతనం

  • కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, మహ్మద్ సిరాజ్‌లకు గ్రేడ్-సీ నుంచి గ్రేడ్-బీకి ప్రమోషన్
  • ఏడాదికి రూ.5 కోట్ల వార్షిక ఆదాయం ఆర్జించనున్న కీలక ఆటగాళ్లు
  • గ్రేడ్-సీ నుంచి గ్రేడ్-బీకి అప్‌ గ్రేడ్ అయిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
  • మొత్తం 11 మంది ఆటగాళ్లకు గ్రేడ్-సీలో చోటు.. ఏడాదికి రూ.1 కోటి వార్షిక వేతనం అందుకోనున్న యువ ఆటగాళ్లు
Here Are The Biggest Gainers From BCCI Contracts

రంజీ ట్రోఫీలో ఆడకపోవడంతో యువ క్రికెటర్లు ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ పేర్లను 2023-24 వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ప్లేయర్ల జాబితా నుంచి బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్టుల్లో ప్రమోట్ అయ్యారు. బ్యాటర్లు కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, పేసర్ మహ్మద్ సిరాజ్‌ల కాంట్రాక్టులు గ్రేడ్-బీ నుంచి 2023/24లో గ్రేడ్-ఏకి అప్‌గ్రేడ్ అయ్యాయి. దీంతో ఈ ముగ్గురు ప్లేయర్లు గత ఏడాది రూ.3 కోట్ల వార్షిక వేతనం అందుకోగా ఈ ఏడాది రూ.5 కోట్లు పొందనున్నారు. మరోవైపు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కాంట్రాక్ట్ గ్రేడ్-సీ నుంచి గ్రేడ్-బీకి ప్రమోట్ చేశారు. దీంతో గతంలో రూ.1 కోటి వార్షిక వేతనం అందుకున్న కుల్దీప్ ఈ ఏడాది రూ.3 కోట్ల ఆదాయాన్ని ఆర్జించనున్నాడు.

11 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్టుల్లో చోటు

ఈ ఏడాది 11 మంది కొత్త ఆటగాళ్ల పేర్లను సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో బీసీసీఐ చేర్చింది. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, ముఖేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, రజత్ పటీదార్‌లు ఈ జాబితాలో ఉన్నారు. వీరందరినీ గ్రేడ్-సీలో చేర్చారు. దీంతో వీళ్లందరూ ఏడాదికి రూ.1 కోటి వార్షిక వేతనం పొందనున్నారు. ఫాస్ట్ బౌలింగ్‌కు సంబంధించి ఐదుగురు యువగాళ్లను కూడా బీసీసీఐ సిఫార్సు చేసింది. ఇదిలావుంచితే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా గ్రేడ్-ఏ ప్లస్ కాంట్రాక్టులో ఉన్నారు. ఏడాదికి రూ.7 కోట్ల ఆదాయం పొందుతున్నారు.

More Telugu News