Kesineni Nani: చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమైనా దేవుడా?: కేశినేని నాని

  • ఏపీలో జగన్ ఓటమి ఖాయమన్న ప్రశాంత్ కిశోర్
  • ప్రశాంత్ కిశోర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్న కేశినేని నాని
  • ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని వెల్లడి
  • తెలంగాణ, రాజస్థాన్ ఫలితాలను ఉదహరించిన నాని
Kesineni Nani opines on Prashant Kishor predictions

విజయవాడ ఎంపీ కేశినేని నాని ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రశాంత్ కిశోర్ అంచనాలపై స్పందించారు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవి పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. ఇటీవల ఆయన చెప్పినవి ఏవీ నిజం కాలేదని అన్నారు. 

"తెలంగాణ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు... కానీ ఓడిపోయింది. రాజస్థాన్ లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నాడు... కానీ ఓడిపోయింది. ప్రశాంత్ కిశోర్ వీడియోను నేను కూడా చూశాను. నా దగ్గర డేటా లేదు కానీ, నాకెందుకో అనిపిస్తోంది జగన్ ఓడిపోతాడని.. అంటూ ప్రశాంత్ కిశోర్ చెప్పాడు. 

కానీ ఆయన చెప్పినవన్నీ తప్పులే. తెలంగాణలో ఆయన అంచనా తప్పింది, రాజస్థాన్ లో ఆయన అంచనా తప్పింది... అక్కడ భారీ మెజారిటీతో బీజేపీ గెలిచింది. చెప్పినవన్నీ జరగడానికి ప్రశాంత్ కిశోర్ ఏమీ దేవుడు కాదు. ప్రశాంత్ కిశోర్ చెప్పినవన్నీ ఇటీవల కాలంలో  ఫెయిల్ అవుతున్నాయన్న విషయాన్ని ప్రజలు గమనించాలి" అని కేశినేని నాని పేర్కొన్నారు.

More Telugu News