KCR: కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

  • ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ భేటీ
  • రాబోయే కాలం మన బీఆర్ఎస్‌దేనని విశ్వాసం 
  • పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచన
KCR blames congress government for ruling

కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై ఏమాత్రం అవగాహన లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలం మన బీఆర్ఎస్‌దేనని విశ్వాసం వ్యక్తం చేశారు. కరీంనగర్ తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఉంటుందన్నారు. పార్టీ నేతలు కలిసికట్టుగా పని చేసి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ముగ్గురితో సమన్వయ కమిటీ ఉండాలని సూచించారు.

More Telugu News