'కన్నప్ప' కోసం రంగంలోకి దిగిన ప్రభుదేవా!
- మంచు విష్ణు హీరోగా రూపొందుతున్న 'కన్నప్ప'
- న్యూజిలాండ్ లో జరుగుతున్న షూటింగ్
- అతిథి పాత్రలో కనిపించనున్న ప్రభాస్
- ప్రత్యేక పాత్రల్లో సీనియర్ స్టార్స్
ప్రభుదేవా ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన 'కన్నప్ప' సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. అనేక పాటలకు కొరియోగ్రఫీని కంపోజ్ చేసే పనిలో ఉన్న ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రభుదేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది. రెండో షెడ్యూల్ న్యూజిలాండ్‌లో ప్రారంభమైందని 'కన్నప్ప' మూవీ టీం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
న్యూజిలాండ్‌లోని అందమైన ప్రదేశాల్లో సినిమాను షూట్ చేస్తున్నారు. విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ తదితరులు నటిస్తున్నారు. 'మహాభారతం' సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.