KCR: కేసీఆర్ కీలక సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గైర్హాజరు

  • ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం
  • భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరు కాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ
  • నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా కలిసిన ఎమ్మెల్యే
Bhadrachalam MLA did not attended kcr meeting

తెలంగాణ భవన్‌లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్యనేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గైర్హాజరయ్యారు. ఆయన హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు ఒక్కరే గెలిచారు. ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలుమార్లు కలిశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ నేతలను కలిశారు. నిన్న కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఇప్పుడు కేసీఆర్ కీలక సమావేశానికి గైర్హాజరయ్యారు.

More Telugu News