BTech Ravi: సాక్షిలో వివేకా హత్యపై కథనం... ఘాటుగా స్పందించిన బీటెక్ రవి

BTech Ravi comments on Sakshi story about Viveka murder

  • వివేకా హత్యలో తన ప్రమేయం ఏదీ లేదన్న బీటెక్ రవి
  • తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమని ప్రకటన
  • అవినాశ్ కు దమ్ముంటే నార్కో టెస్టుకు అంగీకరించాలని సవాల్

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యోదంతంపై సాక్షిలో వచ్చిన కథనంపై పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తీవ్రంగా స్పందించారు. 

వివేకా హత్యలో తన ప్రమేయం లేదని, తాను నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మరి, అవినాశ్ రెడ్డి కూడా అతడి ప్రమేయం ఏమీ లేదని నార్కో అనాలిసిస్ టెస్టుకు సిద్ధమా? అని బీటెక్ రవి సవాల్ విసిరారు. 

ఈ కేసును సీరియస్ గా తీసుకుంటే అవినాశ్ బీజేపీలోకి పోతాడని సునీతతో జగన్ అన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. వివేకాను గొడ్డలితో చంపారన్న విషయం హత్య జరిగిన రోజునే జగన్ కు ఎలా తెలిసిందని నిలదీశారు.

ఈ కేసులో జగన్ ప్రమేయం ఉందన్న విషయం త్వరలోనే బయటికి వస్తుందని, అసలు, వివేకా హత్యను నిందితులు వీడియో తీసి వైసీపీ పెద్దలకు పంపారన్న సమాచారం కూడా ఉందని బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో కొన్ని అంశాలు బయటి ప్రపంచానికి తెలియకముందే జగన్ కు ఎలా తెలిశాయో చెప్పాలని అన్నారు.

  • Loading...

More Telugu News