Kona Venkat: చెబితే వినిపించుకోనివాడే వర్మ: కోన వెంకట్

  • వర్మ వైరాగ్యంతో ఉన్నాడన్న కోన వెంకట్
  • ఎవరు చెప్పినా వినిపించుకోడని వ్యాఖ్య 
  • తనది తప్పని ఒప్పుకోడని వెల్లడి
  • తన కెరియర్ లో వర్మ చూడనిది లేదని వివరణ  

Kona Venkat Interview

టాలీవుడ్ లో రచయితగా .. నిర్మాతగా కోన వెంకట్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథ - స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కెరియర్ ఆరంభంలో వర్మ సినిమాలకి కోన వెంకట్ పని చేశారు. తాజాగా ఎన్టీవీ ఎంటర్టైన్ మెంట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ గురించి కోన వెంకట్ మాట్లాడారు. 

" కొన్నేళ్ల పాటు సంసారం చేసిన తరువాత, జీవితం పట్ల వైరాగ్యంతో సన్యాసం తీసుకునేవాళ్లు కొంతమంది ఉంటారు. వర్మ ఒక దర్శకుడిగా తానేమిటనేది ఈ ప్రపంచానికి చూపించాడు. డబ్బు .. కీర్తి ప్రతిష్ఠలు అన్నీ చూసేశాడు. ఇక ఇప్పుడు ఆయున చేసిన సినిమాలు చూస్తుంటే, సినిమాల పట్ల ఆయన వైరాగ్యంతో ఉన్నాడేమోనని అనిపిస్తోంది" అన్నారు. 

"వర్మ తాను చేస్తున్నది తప్పని ఎప్పుడూ అనుకోడు. ఎవరైనా చెప్పినా వినిపించుకోడు. అసలు చెప్పింది వినిపించుకోనివాడిపేరే వర్మ. పదిమందికి నచ్చే సినిమా కాదు .. నాకు నచ్చిన సినిమా తీస్తాను .. నచ్చితే చూడండి .. లేకపోతే లేదు అనే ఒక ఫిలాసఫీలోకి ఆయన వెళ్లిపోయాడు. తనకి నచ్చినట్టుగా బ్రతకడం తెలిసిన ఏకైక జీవినే ... ఆర్జీవీ' అనే అభిప్రాయాన్ని వెంకట్ వ్యక్తం చేశారు.

More Telugu News