Nayanthara: నయనతార విడాకులు తీసుకుంటోందా...? మరి విఘ్నేశ్ ఇలా పోస్టు చేశాడేంటీ!

Vignesh Sivan Instagram post halts rumours Nayanthara ready to divorce
  • నయనతార తన భర్తను ఇన్ స్టాలో అన్ ఫాలో చేసిందంటూ వార్తలు
  • విడాకులు తీసుకుంటోందంటూ కథనాలు
  • నయనతారకు ఓ అవార్డు వచ్చిందంటూ వెల్లడించిన విఘ్నేశ్ శివన్
  • ఇన్ స్టాలో విఘ్నేశ్ పోస్టు పట్ల అభిమానుల ఆనందం 
  • వారి కాపురం హాయిగా సాగుతోందంటూ సంతోషం
సోషల్ మీడియాలో రూమర్లు వ్యాప్తి చెందడానికి పెద్దగా సమయం అక్కర్లేదు. అందుకు నయనతార ఉదంతమే నిదర్శనం. ఆమె తన భర్త విఘ్నేశ్ శివన్ ను ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసిందంటూ ఓ వార్త బయల్దేరింది. దాంతో, నయనతార విడాకులు తీసుకుంటోందంటూ కథనాలు వెల్లువెత్తాయి. నిజనిర్ధారణ చేసుకోకుండానే ఇష్టం వచ్చినట్టు రాసేశారు. 

తాజాగా, తన భార్య నయనతారకు ఓ అవార్డు వచ్చిందంటూ విఘ్నేశ్ శివన్ ఎంతో మురిపెంతో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇటీవలే నయనతార ఓ చర్మసౌందర్య ఉపకరణాల బ్రాండ్ ను తీసుకువచ్చారు. ఆ బ్రాండ్ కు అవార్డు వచ్చిందని విఘ్నేశ్ ఎంతో సంతోషంగా వెల్లడించారు. ఈ పోస్టుతో నయనతార విడాకుల కథనాలకు అడ్డుకట్ట పడింది. 

దీనిపై అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. నయనతార, విఘ్నేశ్ కాపురం ఎంతో హాయిగా సాగుతోందనడానికి ఈ పోస్టే నిదర్శనమని అభిమానులు సంతోషం వెలిబుచ్చుతున్నారు. ఏదో సాంకేతిక లోపం వల్లే విఘ్నేశ్ శివన్ పేరు నయనతార ఇన్ స్టా ఫాలోవర్ల జాబితాలో కనిపించి ఉండకపోవచ్చని ఫ్యాన్స్ సర్దిచెప్పుకుంటున్నారు. 

నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ ఏడేళ్ల పాటు ప్రేమించుకుని, 2022లో పెళ్లితో ఒక్కటయ్యారు. వారికి ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
Nayanthara
Vignesh Sivan
Divorce
Rumours
Kollywood

More Telugu News