కొడుకు ప్రీ వెడ్డింగ్ వేడుకలో నీతా అంబానీ డ్యాన్స్ ప్రదర్శన.. మైమరచిపోయిన ఆహూతులు.. వీడియో ఇదిగో!
- జామ్‌నగర్‌లో వైభవంగా అనంత్ అంబానీ-రాధిక ముందస్తు పెళ్లి వేడుకలు
- ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రముఖులు
- ‘విశ్వంభర స్తుతి’కి సంప్రదాయ ప్రదర్శన ఇచ్చిన నీతా అంబానీ
- తన ప్రదర్శనను మనవరాళ్లు, యువతులకు అంకితమిచ్చిన నీతా
నిన్న జరిగిన వేడుకల్లో నీతా అంబానీ ఇచ్చిన సంప్రదాయ నృత్య ప్రదర్శన చూసి ఆహూతులు మైమరచిపోయారు. ‘విశ్వంభర స్తుతి’కి ఆమె ఇచ్చిన ప్రదర్శన ‘ఔరా’ అనిపించింది. విశ్వంభర శృతి అనేది దుర్గాదేవిని స్తుతిస్తూ ఆలపించే పాట. నీతా తన ప్రదర్శనను తన మనవరాళ్లు ఆదియా శక్తి, వేద సహా మహిళా శక్తి స్వరూపాలైన యువతులకు అంకితమిచ్చారు.