Meg Lanning: మెగ్ లానింగ్ మరో రికార్డు.. టీ20ల్లో అత్యంత వేగంగా 9 వేల పరుగులు అందుకున్న మహిళా క్రికెటర్‌గా రికార్డు

  • విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ కేపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న ఆసీస్ మాజీ కెప్టెన్
  • ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకం నమోదు
  • కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ ఫాస్టెస్ట్ 9 పరుగుల రికార్డు బద్దలు
Delhi Capitals Skipper Meg Lanning creates history becomes fastest to score 9000 T20 runs

ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మెగ్ లానింగ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. టీ20ల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. విమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ కేపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న లానింగ్ గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 

మ్యాచ్‌కు ముందు ఈ ఘనత సాధించడానికి అడుగు దూరంలో ఉన్న లానింగ్ ఈ సీజన్‌లో రెండో అర్ధ శతకం సాధించడం ద్వారా ఈ అరుదైన రికార్డు అందుకుంది. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్‌తో 55 పరుగులు చేసిన ఆమె జట్టు 163 పరుగులు సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ ప్లేయర్ సోఫీ డివైన్ ఫాస్టెస్ట్ 9000 పరుగుల రికార్డును అధిగమించింది. 

మహిళా టీ20 క్రికెట్‌లో సోఫీ 297 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా లానింగ్ 289 ఇన్నింగ్స్‌లలో ఆ రికార్డును అందుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో బెత్ మూనీ (299), సునీ బేట్స్ (323) ఉన్నారు.

More Telugu News