sridhar babu: అందుకే తండ్రికి సేవ చేయలేకపోయాను: మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగం

  • తాను స్థిరపడుతున్న సమయంలో తన తండ్రి చనిపోయారని గుర్తు చేసుకున్న శ్రీధర్ బాబు
  • తల్లిదండ్రులకు సేవ చేయలేకపోయినందుకు ఏదో రూపంలో సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడి
  • శ్రీపాదరావు జయంతి రోజున విశిష్ట వ్యక్తులకు సన్మానం చేస్తున్నట్లు వెల్లడి
Minister Sridhar Baby in Sripadharao Jayanthi

తాను చదువుకుంటున్న సమయంలో... జీవితంలో స్థిరపడుతున్న సమయంలో తన తండ్రి హత్య జరిగిందని, దీంతో తాను తన తల్లిదండ్రులకు సేవ చేయలేకపోయామని... అందుకే ఏదో రూపంలో సేవ చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గత పాతికేళ్ళుగా తన తండ్రి జయంతి సందర్భంగా కొంతమంది విశిష్ట వ్యక్తులకు సన్మానం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు కూడా కొంతమందికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్మానం చేస్తున్నామన్నారు. శనివారం రవీంద్ర భారతిలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు.

 ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తమ ప్రాంతంలో తన తండ్రిని దేవుడిగా కొలుస్తారని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజా సమస్యల పట్ల తన తండ్రి ఎంతో చిత్తశుద్ధితో పని చేశారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి నాయకుడి వరకు ఎదిగారన్నారు. పీవీ నర్సింహారావుకు ప్రధాన శిష్యుడిగా తన తండ్రి రాజకీయ ప్రయాణం ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. గిరిజన, బడుగు, బలహీన వర్గాల కోసం... రోడ్లు, కరెంట్ లేని గ్రామాలలో అభివృద్ధి కోసం పని చేశారన్నారు.

More Telugu News