Meta: మెటా అనే పేరును ఓ బ్రెజిల్ కంప్యూటర్ కంపెనీకి కోల్పోయిన ఫేస్ బుక్ మాతృసంస్థ

  • 2021లో మెటాగా మారిన ఫేస్ బుక్ మాతృసంస్థ
  • మెటా అనే పేరును 2000 సంవత్సరంలోనే రిజిస్టర్ చేయించామన్న బ్రెజిల్ కంపెనీ
  • బ్రెజిల్ సంస్థకు అనుకూలంగా సావోపాలో కోర్టు తీర్పు 
  • నెలరోజుల్లో మెటా అనే పేరు మార్చేయాలని ఆదేశాలు
Facebook parent firm Meta lost its name to a Brazilian tech company

ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ వంటి ప్రముఖ నెట్కవర్కింగ్, సోషల్ మెసేజింగ్ సైట్లకు మాతృసంస్థ మెటా అని తెలిసిందే. అయితే మెటా అనే పేరు తనకే చెందుతుందంటూ బ్రెజిల్ కు చెందిన ఓ కంప్యూటర్ సేవల సంస్థ న్యాయపోరాటం చేసి గెలిచింది.

ఆ బ్రెజిల్ సంస్థ పేరు మెటా సర్వీసెస్. ఫేస్ బుక్ మాతృసంస్థ కూడా మెటా అనే పేరునే ఉపయోగించడం వల్ల థర్డ్ పార్టీ క్లయింట్లలో గందరగోళం తలెత్తుతోందని మెటా సర్వీసెస్ బ్రెజిల్ లోని సావోపాలో కోర్టులో దావా వేసింది. 

దీనిపై విచారణ జరిపిన కోర్టు... మెటా అనే పేరును వినియోగించడం నెల రోజుల్లోపు నిలిపివేయాలని, లేదా రోజుకు రూ.16.73 లక్షల జరిమానా చెల్లించాలని ఫేస్ బుక్ మాతృసంస్థను ఆదేశించింది. 

ఈ తీర్పుపై మెటా ఇప్పటివరకు స్పందించలేదు. అయితే, సావోపాలో కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే అవకాశం ఉంది. 

మెటా అనే పేరును తాము 2000 సంవత్సరంలోనే బ్రెజిల్ మేధో హక్కుల సంస్థ వద్ద నమోదు చేయించామని మెటా సర్వీసెస్ వెల్లడించింది. కాగా, 2021 అక్టోబరులో ఫేస్ బుక్ మెటాగా మారింది.

More Telugu News