KTR: కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున కేటీఆర్ కృతజ్ఞతలు

KTR thanks to central government
  • రక్షణ శాఖ భూముల్లో ఎలివేటర్ కారిడార్లకు అనుమతి ఇవ్వడంతో థ్యాంక్స్ చెప్పిన కేటీఆర్
  • ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన బీఆర్ఎస్ నేత
  • కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి
కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారిపై ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. జనవరి 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ క్రమంలో తాజాగా కేంద్రం అనుమతి ఇవ్వడంతో కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

ఎలివేటెడ్ కారిడార్లు బీఆర్ఎస్ పదేళ్ల కష్టానికి ఫలితమన్నారు. రక్షణ శాఖ భూముల కోసం తాము అలుపెరగని పోరాటం చేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రమంత్రులకు పదుల సంఖ్యలో వినతులు ఇచ్చామన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్కైవేల నిర్మాణాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.
KTR
Telangana
Congress

More Telugu News