AP BJP: ఏపీలో ఒంటరిగా పోటీ చేసేందుకైనా బీజేపీ సిద్ధం: ఆదినారాయణరెడ్డి

Adinarayana Reddy says BJP even ready to contest alone in AP
  • బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు
  • టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయన్న ఆదినారాయణరెడ్డి
  • ప్రకటించాల్సిన స్థానాలు ఇంకా చాలా ఉన్నాయని వెల్లడి
సాధారణ ఎన్నికల నేపథ్యంలో, ఏపీలో పొత్తులు, జాబితా రూపకల్పనపై బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, జిల్లా కన్వీనర్ల సమావేశం జరిగింది. 

ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో శివప్రకాశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. తిరుపతి, హిందూపురం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం రమేశ్, ఆదినారాయణరెడ్డి, విష్ణుకుమార్ వంటి బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా పాల్గొన్నారు. పురందేశ్వరి, కిరణ్ కుమార్ రెడ్డి, సత్యకుమార్ వంటి అగ్రనేతలు శివప్రకాశ్ తో విడివిడిగా సమావేశమయ్యారు. 

ఈ సమావేశం అనంతరం ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ఏపీలో పొత్తులను బీజేపీ హైకమాండ్ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. పొత్తులతో వెళ్లేందుకైనా సిద్ధం... ఒంటరిగా పోటీ చేసేందుకైనా సిద్ధం అని వ్యాఖ్యానించారు. 

టీడీపీ-జనసేన 99 స్థానాలకే అభ్యర్థులను ప్రకటించాయని, ఇంకా ప్రకటించాల్సిన స్థానాలు చాలా ఉన్నాయని వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో తాను జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని చెప్పానని ఆదినారాయణరెడ్డి తెలిపారు.
AP BJP
Adinarayana Reddy
Elections
Andhra Pradesh

More Telugu News