Ram Charan: ఫ్లైట్ లో భార్య కాళ్లు నొక్కిన రామ్ చరణ్.. వీడియో ఇదిగో!

  • అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రైవేట్ జెట్ లో పయనం
  • ప్రయాణంలో కునుకు తీసిన ఉపాసన
  • ఉపాసన కాళ్లకు సున్నితంగా మసాజ్ చేసిన చెర్రీ
Ram Charan Foot Massage To Upasana Konidela While Flight Jamnagar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి మహిళల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల విమానంలో వెళుతూ రామ్ చరణ్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన మహిళా అభిమానులు.. చెర్రీ ఆదర్శ భర్త అని, బెస్ట్ హజ్బెండ్ అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే..

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల ప్రి వెడ్డింగ్ గ్రాండ్ గా జరుగుతోంది. ఈ వేడుకకు ఆహ్వానం అందడంతో రామ్ చరణ్, ఉపాసన దంపతులు శుక్రవారం జామ్ నగర్ బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ జెట్ లో ప్రయాణిస్తూ ఉపాసన కునుకు తీయగా.. రామ్ చరణ్ ఆమె పాదాలకు మసాజ్ చేశాడు.

దీనిని రామ్ చరణ్ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ గా మారింది. వీడియో చూసిన మహిళలు రామ్ చరణ్ ను తెగ మెచ్చుకుంటున్నారు. కాగా, రామ్ చరణ్ ఇంట్లోను, బయట కూడా భార్యకు ఎంతో సాయంగా వుంటారు. ఇంటి పనుల్లో ఓ చేయి వేయడం, బయట షాపింగ్ కు వెళితే బ్యాగులు తను తీసుకురావడం.. ఇలా అన్నింట్లోనూ భార్య ఉపాసనకు చెర్రీ చేదోడువాదోడుగా ఉంటారు.

More Telugu News