Gautam Gambhir: గౌతం గంభీర్ సంచలన నిర్ణయం.. బీజేపీకి రాంరాం.. అసలు విషయం ఇదేనంటూ వార్తలు!

Gautam Gambhir Quits BJP Ahead Of 2024 Elections
  • తనను రాజకీయ విధుల నుంచి రిలీవ్ చేయాలంటూ బీజేపీ చీఫ్ నడ్డాను కోరిన గంభీర్
  • క్రికెట్ వ్యవహారాలపై దృష్టిపెట్టాలనుకుంటున్నట్టు చెప్పిన మాజీ క్రికెటర్
  • వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతోనే నిర్ణయమంటూ పుకార్లు
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ప్రకటించాడు.

మార్చి 2019లో బీజేపీలో చేరిన గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ ఎన్నికల్లో ఏకంగా 6.95 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించిన గంభీర్ అనతికాలంలో బీజేపీలో ప్రముఖ వ్యక్తిగా మారాడు. తాజాగా రాజకీయాలకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు.

రాజకీయ విధుల నుంచి తనను రిలీవ్ చేయాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్టు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించాడు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపుకొంటున్నట్టు పేర్కొన్నాడు. అయితే, గంభీర్ బీజేపీకి రాంరాం చెప్పడం వెనక మరో కారణం కూడా ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదని, అందుకనే అతడీ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.
Gautam Gambhir
BJP
JP Nadda
X Corp
New Delhi
Cricket

More Telugu News