Tower of London: లండన్ కోటకు కాకుల కాపలా.. వాటి బాగోగులు చూసేందుకు ఐదుగురు సిబ్బంది

  • కాకులకు నిత్యం మాంసాహారం, వైద్య పరీక్షలు
  • వెయ్యేళ్ల కిందట కోట నిర్మాణం
  • తొలుత రాజభవనం.. తర్వాత జైలుగా మార్పు
Tower of London appoints new ravenmaster

వెయ్యేళ్ల కిందట నిర్మించిన లండన్ కోటకు కాకులు కాపలా కాస్తాయట.. ఆ కాకులు వెళ్లిపోతే కోటతో పాటు ఇంగ్లాండ్ రాజ్యం కూలిపోతుందనేది స్థానికుల విశ్వాసం. ఈ నమ్మకం కారణంగానే 17వ శతాబ్దంలో అప్పటి ఇంగ్లాండ్ పాలకుడు కింగ్ ఛార్లెస్-2 ఈ టవర్ వద్ద ఎల్లప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలని ఆదేశించారు. వాటి సంరక్షణ కోసం ప్రత్యేకంగా భటులను నియమించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం అలాగే కొనసాగుతూ వస్తోంది. 

తాజాగా ఈ కాకుల సంరక్షణ బాధ్యతను రాయల్ మెరైన్ మాజీ సైనికుడు మైఖేల్ బార్నీ చేపట్టడంతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ యాభై ఆరేళ్ల మాజీ సైనికుడు షాండ్లర్ జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు మొత్తం ఐదుగురు గార్డులు ఈ కాకులకు నిత్యం మాంసాహారం అందించడం, ఉడికించిన గుడ్లు, బిస్కెట్లు అందించడంతో పాటు అవి ఎగిరిపోకుండా వాటి ఈకలను స్వల్పంగా కత్తిరిస్తుంటారు. 

కింగ్‌ విలియం -1 ఇంగ్లాండ్ ను జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. తొలినాళ్లలో దీనిని రాజభవనంగా ఉపయోగించారు. తర్వాతికాలంలో చెరసాలగా మార్చి ఖైదీలను ఇందులో ఉంచేవారు. ఇటీవలి కాలం వరకూ ఇక్కడ నిత్యం ఆరు కాకులు ఉండేవి. కిందటేడాది కింగ్ ఛార్లెస్ - 3 పట్టాభిషేకం జరిగిన తర్వాత ఈ కాకుల సంఖ్యను ఏడుకు పెంచారు. పొద్దంతా టవర్ చుట్టు పక్కల ఎగురుతూ టూరిస్టులను అలరించే ఈ కాకులు రాత్రయితే పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి.

More Telugu News