నిమిషం నిబంధన ఎత్తివేస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం

TS Inter board lifts one minute late rule
  • తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు ఊరట
  • పరీక్ష హాలుకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని నిర్ణయం
  • విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు 
తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు ఇంటర్ విద్యార్థులకు ఊరటనిచ్చింది! పరీక్షకు నిమిషం నిబంధనను ఎత్తివేస్తూ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష హాలుకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.

ఉదయం తొమ్మిది గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని గతంలో ఇంటర్ బోర్డు పేర్కొంది. తాజాగా 9 గంటల తర్వాత ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
Intermediate
Telangana
Inter Students
One Minute Late Rule

More Telugu News