Stock Market: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా 1,245 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్

  • 356 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఐటీ, టెక్ సూచీలకు నష్టాలు
  • 6.46 శాతం లాభపడ్డ టాటా స్టీల్ షేర్లు
Sensex gains 1245 points

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డును సృష్టించాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు, అమెరికా ఫెడ్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో జోష్ ను నింపాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,245 పాయింట్లు లాభపడి 73,745కి చేరుకుంది. నిఫ్టీ 356 పాయింట్లు ఎగబాకి 22,339కి పెరిగింది. మెటల్, కన్జ్యూమర్ గూడ్స్, బ్యాంకింగ్ సూచీలు భారీ లాభాలను మూటకట్టుకున్నాయి. ఐటీ, టెక్ సూచీలు నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (6.46%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (4.46%), ఎల్ అండ్ టీ (4.39%), టైటాన్ (3.73%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.44%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.36%), ఇన్ఫోసిస్ (-1.19%), సన్ ఫార్మా (-1.11%), టెక్ మహీంద్రా (-0.36%).      

అమెరికా డాలరుతో పోలిస్తే మన రూపాయి మారకం విలువ రూ. 82.90గా ఉంది.

More Telugu News