కాకినాడలో దారుణం.. పెళ్లి రోజునే భార్యను హత్య చేసిన భర్త
- భార్యపై అనుమానంతో కొంతకాలంగా ఘర్షణలు
- గురువారం ఉదయం కత్తితో విచక్షణారహితంగా దాడి
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపిన పోలీసులు
కాగా వీరిద్దరూ 2016 ఫిబ్రవరి 29న ప్రేమపెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండవ వివాహ వార్షికోత్సవం రోజున ఈ హత్య జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయని తెలిసిందని పోలీసులు వివరించారు. ఫ్యాబ్రికేషన్ కాంట్రాక్టు పనులు చేసే నిందితుడు నూకరాజు.. ఆ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్తే రెండుమూడురోజుల తర్వాత ఇంటికి వస్తుండేవాడని, ఈ క్రమంలో కొన్నాళ్లుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడని వివరించారు. ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారమని సీఐ సురేష్ బాబు వివరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా నిందితుడు హత్య తర్వాత పోలీసులకు లొంగిపోయినట్టుగా తెలుస్తోంది.