KTR: ఇప్పటివరకూ నేనందుకున్న అత్యంత క్యూట్ ఆహ్వానం ఇదే: కేటీఆర్

This is the cutest invitation that Ive ever received says KTR

  • హైదరాబాద్ మిలీనియమ్ స్కూల్ వార్షికోత్సవానికి విద్యార్థుల ఆహ్వానం
  • వీడియో సందేశం ద్వారా కేటీఆర్‌కు చిన్నారుల పిలుపు
  • వార్షికోత్సవానికి హాజరవుతానంటూ కేటీఆర్ ట్వీట్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ను కొందరు చిన్నారులు తమ ముద్దులొలికే మాటలతో సర్‌ప్రైజ్ చేశారు. వాళ్ల ముచ్చటైన మాటలు తన మనసును మార్చేశాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చిన్నారుల ఆహ్వానం మేరకు వారి పాఠశాల వార్షికోత్సవానికి హాజరవుతానని చెప్పారు. స్వయంగా వారిని అభినందిస్తానంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

మార్చి 3న హైదరాబాద్ మిలీనియమ్ స్కూల్ మూడవ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేటీఆర్‌ను స్కూల్ విద్యార్థులు వీడియో సందేశంతో ఆహ్వానించారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తనకు ఆ రోజు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పటికీ చిన్నారుల క్యూట్ ఆహ్వానంతో మనసు మారిందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ తనకొచ్చిన అత్యంత క్యూట్ సందేశం ఇదేనన్నారు.

KTR
Hyderabad Millenium School
BRS
  • Loading...

More Telugu News