Lok Sabha Polls: లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం మోదీ అధ్యక్షతన సమావేశం

PM Modi chairs key BJP meeting to pick candidates for Lok Sabha polls

  • మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం
  • లోక్‌సభ అభ్యర్థుల ఎంపికకు కసరత్తు
  • ఈసీ నోటిఫికేషన్‌కు ముందే లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు అవకాశం
  • తొలి విడతలో యూపీ అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌లతో పాటూ ఇతర కీలక నేతలైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దియో సాయ్ తదితరులు పాల్గొన్నారు. 

ఏప్రిల్ - మే నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల తొలిజాబితాను ఈసీ నోటిఫికేషన్ కు ముందే విడుదల చేయాలని పార్టీ యోచిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, యూపీలో బీజేపీ కాస్తంత బలహీనంగా ఉన్న స్థానాలకు తొలుత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై చర్చించేందుకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, పార్టీ చీఫ్ జేపీ నడ్డా గతవారం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశమయ్యారు. యూపీలో పార్టీకి గట్టి పోటీ ఎదురయ్యే స్థానాలపై చర్చలు జరిపారు.

  • Loading...

More Telugu News