Revanth Reddy: దామోదర రాజనర్సింహ కూతురు పెళ్లికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్

CM Revanth Reddy attended the marriage ceremony of Damodara Raja Narasimha
  • హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో దామోదర కూతురు వివాహం
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్ రెడ్డి
  • ఆలింగనం చేసుకొని ఆహ్వానించిన దామోదర రాజనర్సింహ
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూతురు వివాహ మహోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో వివాహం జరిగింది. ఈ పెళ్లికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి వధూవరులను ఆశీర్వదించారు.

రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డిని దామోదర రాజనర్సింహ ఆలింగనం చేసుకొని ఆహ్వానించారు. కేటీఆర్ కూడా పెళ్లికి హాజరై వధువరులను ఆశీర్వదించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తదితరులు ఉన్నారు.
 
Revanth Reddy
Damodara Raja Narasimha
KTR
Congress

More Telugu News