ప్రముఖ గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
- కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వడ్డేపల్లి శ్రీనివాస్
- సికింద్రాబాద్ లోని నివాసంలో నేడు మృతి
- గబ్బర్ సింగ్ లో 'గన్నులాంటి కన్నులున్న...' పాట పాడిన శ్రీనివాస్
వడ్డేపల్లి శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది కొన్ని రోజుల కిందటే డిశ్చార్జి అయ్యారు. వడ్డేపల్లి శ్రీనివాస్ సినీ గాయకుడిగా కంటే జానపద గాయకుడిగా ఎంతో గుర్తింపు పొందారు. 100కి పైగా ప్రైవేట్ సాంగ్స్ తో అలరించారు. గబ్బర్ సింగ్ చిత్రంలోని పాటకు ఆయన ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు.