Jithender Reddy: వాట్ టు డూ అంటూ ఆసక్తికర వీడియో షేర్ చేసిన జితేందర్ రెడ్డి

Jithender Reddy shares interesting video
  • లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించనున్న బీజేపీ
  • తెలంగాణ నుంచి 10 మంది పేర్లను ప్రకటించే అవకాశం
  • మహబూబ్ నగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న జితేందర్ రెడ్డి
తెలంగాణ బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈరోజు ఖరారు చేయనున్నారు. తెలంగాణ నుంచి 10 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డి ఎక్స్ వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. వాట్ టు  డూ.. వాట్ నాట్ టు డూ బిఫోర్ ఎలెక్షన్స్ అని అన్నారు. ఓ చిన్నారి చేతులు వెనక్కి పెట్టుకుని తిరుగుతున్న వీడియోను షేర్ చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు.
Jithender Reddy
BJP

More Telugu News