Irfan Pathan: హార్దిక్ పాండ్యా లాంటి వాళ్లకు లేని ఆంక్షలు ఇషాన్, శ్రేయాస్‌పై ఎందుకు?: ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర వ్యాఖ్యలు

  • నిన్న సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ప్రకటించిన బీసీసీఐ
  • అయ్యర్, ఇషాన్‌కు దక్కని చోటు
  • రంజీల్లో ఆడకుండా ఐపీఎల్‌కు ప్రాక్టీస్ చేస్తుండడమే కారణం!
  • యువ ఆటగాళ్లకు ఇదో గట్టి హెచ్చరిక అన్న ఇర్ఫాన్
  • వారిద్దరూ మరింత బలంగా జట్టులోకి వస్తారని ఆశాభావం
Irfan Pathan Big Comments On Hardik Pandya

టీమిండియా ఆటగాళ్లకు చెందిన సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ నిన్న ప్రకటించింది. కెప్టెన్ రోహిత్‌శర్మ, ఏస్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రా, డ్యాషింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టాప్ గ్రేడ్ దక్కించుకున్నారు. డిసెంబరులో సౌతాఫ్రికా టూర్ నుంచి స్వదేశానికి చేరుకున్న ఇషాన్ కిషన్ వ్యక్తిగత కారణాలు చెప్తూ రంజీట్రోఫీలో ఝార్ఖండ్‌ జట్టుకు దూరంగా ఉంటూనే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

మరోవైపు, శ్రేయాస్ అయ్యర్ కూడా ముంబై జట్టుకు దూరంగా ఉన్నాడు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడలేదు. ఇంగ్లండ్‌తో రెండో టెస్టుకు ముందు అతడిని జట్టు నుంచి తప్పించినప్పటికీ రంజీలో ఆడేందుకు అయ్యర్ విముఖత ప్రద్శించాడు. అయితే, మార్చి 2న జరగున్న రంజీ సెమీఫైనల్స్‌లో మాత్రం అతడు ఆడే అవకాశం ఉంది.

రంజీ ట్రోఫీలో ఆడని అయ్యర్, ఇషాన్ కిషన్‌ను కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ తప్పించింది. దీనిపై టీమిండియా మాజీ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. వారిద్దరూ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లని, త్వరలోనే వారు మరింత బలంగా జట్టులోకి వస్తారని పేర్కొన్నాడు. 

హార్దిక్ పాండ్యా రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదని, అతడితోపాటు ఇతర ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడనప్పుడు దేశవాళీ వైట్‌బాల్ క్రికెట్ ఆడాలని, దీనిని అందరికీ వర్తింపజేయాలని పేర్కొన్నాడు. లేదంటే భారత క్రికెట్ అనుకున్న లక్ష్యాలను సాధించలేదని పేర్కొన్నాడు. జాతీయ జట్టుకు ఆడనప్పుడు ఇండియన్ క్రికెటర్లు అందరూ దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ చెప్పాలని ఇర్ఫాన్ పేర్కొన్నాడు. అయ్యర్, ఇషాన్‌ను తప్పించడంతో యువ ఆటగాళ్లకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అయిందన్నాడు.

More Telugu News