Renuka chowdary: రేణుకా చౌదరి అనుచరుడిపై కత్తులతో దుండగుల దాడి

Congress Leader Renuka Chowdary Key Aid Attacked By Goons
  • బుధవారం అర్ధరాత్రి కొణిజర్ల గ్రామంలో ఘటన
  • సూరంపల్లి రామారావు పరిస్థితి సీరియస్
  • ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్న వైద్యులు
కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ముఖ్య అనుచరుడు సూరంపల్లి రామారావుపై బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. కొణిజర్లలోని ఆయన నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి కత్తులతో దాడి చేశారు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడిన రామారావును స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఐసీయూలో చేర్చి వైద్యులు చికిత్స చేస్తున్నారు. రామారావు పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉందని చెప్పారు.

స్థానికులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో రామారావు తన ఇంటి ఆవరణలోని బాత్ రూమ్ కు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాసిన ముగ్గురు దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో రామారావు తీవ్రంగా గాయపడ్డారు. రామారావు కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు రాగా.. దుండగులు పారిపోయారు. రామారావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. భూవివాదాలు, పాత కక్షల వల్లే ఈ దాడి జరిగినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. కటుుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొణిజర్లలో 144 సెక్షన్ విధించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
Renuka chowdary
Ramarao
Congress
Vyra
Khammam District
Goons
Attack

More Telugu News