Revanth Reddy: ఔటర్ నుంచి రీజినల్ రింగ్ రోడ్డుకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలి: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy review on Radial roads
  • హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష
  • మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచన
  • ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్న సీఎం

ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో హెచ్ఎండీఏ, పురపాలక శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు రేడియల్ రోడ్లకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ 2050కి అనుగుణంగా విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలను ఒకే యూనిట్‌గా అభివృద్ధి చేయాలన్నారు. ఓటర్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్య ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేవాలని సూచించారు.

  • Loading...

More Telugu News