Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • ట్రేడింగ్ ప్రారంభమైన కాసేపటికే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
  • 790 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 247 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు కేసేపటికే నష్టాల్లోకి జరుకున్నాయి. ఆ తర్వాత చివరి వరకు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్లు నష్టపోయి 72,304కి పడిపోయింది. నిఫ్టీ 247 పాయింట్లు కోల్పోయి 21,951కి దిగజారింది. ఈరోజు అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (0.78%), టీసీఎస్ (0.33%), ఇన్ఫోసిస్ (0.32%), భారతి ఎయిర్ టెల్ (0.12%). 

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-4.43%), మారుతి (-2.94%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.93%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.68%), విప్రో (-2.68%).

More Telugu News