Lok Pal: లోక్ పాల్ చైర్మన్, ఇతర సభ్యులను నియమించిన రాష్ట్రపతి ముర్ము

President Of India Droupadi Murmu appoints Lok Pal Chairman and members

  • లోక్ పాల్ చైర్మన్ గా జస్టిస్ అజయ్ మాణిక్ రావు
  • ఆరుగురు సభ్యులను కూడా నియమించిన రాష్ట్రపతి
  • సంబంధిత ఉత్తర్వుల జారీ

అవినీతిని నిరోధించే క్రమంలో దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడే ఉద్దేశంతో ఏర్పాటైన సంస్థ... లోక్ పాల్. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లోక్ పాల్ కు నూతన చైర్మన్, ఇతర సభ్యులను నియమించారు. 

లోక్ పాల్ చైర్మన్ గా సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మాణిక్ రావును నియమించారు. ఆరుగురు సభ్యులను కూడా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జ్యుడిషియల్ సభ్యులుగా జస్టిస్ లింగప్ప నారాయణస్వామి, జస్టిస్ సంజయ్ యాదవ్, జస్టిస్ రుతురాజ్ వ్యవహరిస్తారు. ఇతర సభ్యులుగా సుశీల్ చంద్ర, పంకజ్ కుమార్, అజయ్ టిర్కీలను నియమించారు. 

లోక్ పాల్ లో గరిష్ఠంగా ఎనిమిది మంది వరకు సభ్యులను నియమించే వీలుంటుంది. అయితే వీరిలో నలుగురు న్యాయ నిపుణులు ఉండాలన్న నిబంధన ఉంది.

  • Loading...

More Telugu News