MLAs Disqualification: ఏపీలో 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్టు సర్క్యులర్ జారీ

Circular issued on 8 MLAs disqualification

  • ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు
  • నిన్న 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ తమ్మినేని
  • నేడు సర్క్యులర్ ఇచ్చిన విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు

ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. వైసీపీ, టీడీపీ నుంచి అందిన అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం 8 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

స్పీకర్ నిర్ణయం నేపథ్యంలో, నేడు అధికారిక సర్క్యులర్ జారీ అయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్, కరణం బలరాంలను అనర్హులుగా ప్రకటిస్తూ విధాన పరిషత్ కార్యదర్శి రామాచార్యులు సర్క్యులర్ ఇచ్చారు. 

గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్, మద్దాలి గిరిధర్, కరణం బలరాం వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవి టీడీపీతో జట్టుకట్టారు.

  • Loading...

More Telugu News