Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామనే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి: పొన్నం ప్రభాకర్

  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో రెండు గ్యారెంటీలు అమలు చేశామని గుర్తు చేసిన మంత్రి
  • ఇప్పుడు మరో రెండు పథకాలను ప్రారంభించినట్లు వెల్లడి
  • తెలంగాణకు ఏమీ చేయని బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్న
Ponnam Prabhakar warns who target congress

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామనే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చేవెళ్ల జన జాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామన్నారు. రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాలను ఈ రోజు ప్రారంభించామన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? అని ఆయన ప్రశ్నించారు.

More Telugu News