Bihar: బీహార్‌లో కాంగ్రెస్‌కు షాక్, బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు

2 Bihar Congress MLAs join BJP ahead of Lok Sabha polls
  • ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరిక
  • అధికార పార్టీ వైపు కూర్చున్న ముగ్గురు ఎమ్మెల్యేలు
  • లోక్ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో మహాఘట్‌బంధన్‌కు వరుస షాక్ లు 
బీహార్‌లో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. వీరు కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆర్జేడీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీని వీడి కమలం కండువాను కప్పుకున్నారు. లోక్ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో మహాఘట్‌బంధన్‌కు వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.

బీజేపీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మురారి ప్రసాద్ గౌతమ్, సిద్ధార్థ్ సౌరవ్ కాగా, ఆర్జేడీ నుంచి సంగీత కుమారి ఉన్నారు. వీరు ముగ్గురు లంచ్ అనంతరం బీజేపీ నేత ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పక్కన నడుస్తూ బీహార్ అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. అంతేకాదు వారు అధికార పార్టీ వైపు కూర్చోవడంతో కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు షాక్‌కు గురయ్యారు.
Bihar
BJP
RJD
JDU

More Telugu News