Uttam Kumar Reddy: తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికే రూ.500కు గ్యాస్ సిలిండర్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Minister Uttam Kumar Reddy about rs500 gas cylinder
  • సగటున ఎవరు ఎన్ని వాడారో చూసుకొని దాని ప్రకారం సిలిండర్లు ఇస్తామని వెల్లడి
  • 40 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయన్న మంత్రి
  • లబ్ధిదారులు జాబితాలో లేని పేర్లను చేర్చుతామని హామీ
తెల్లకార్డు ఉన్నవారికే రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. సగటున ఎవరు ఎన్ని వాడారో చూసుకొని దాని ప్రకారం సిలిండర్లు అందిస్తామన్నారు. దాదాపు 40 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతాయన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి గ్యాస్ సిలిండర్ ఇస్తామని, లబ్ధిదారుల జాబితాలో లేని పేర్లను చేర్చుతామని హామీ ఇచ్చారు.

కొన్నేళ్లుగా దేశంలో గ్యాస్ సిలిండర్ ధర బాగా పెరిగిందన్నారు. మహిళలకు ఊరట కల్పించాలనే ఉద్దేశ్యంతో రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఊరటనిస్తుందన్నారు. ఈ పథకంలో లోపాలు గుర్తించి మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తామన్నారు. పేదలకు ఎక్కువ ఉపయోగం కలిగేలా అభయ హస్తం గ్యారంటీలు ప్రకటించినట్లు పునరుద్ఘాటించారు.
Uttam Kumar Reddy
Congress
Telangana

More Telugu News