Loan APP: లోన్ యాప్ వేధింపులకు హైదరాబాద్ లో విద్యార్థి బలి

Engineering Student Suicide Due To Loan APP Agents Torture In Hyderabad
  • ఏజెంట్ల బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
  • దుండిగల్ ఏరోనాటిక్ కాలేజీలో బీటెక్ చదువుతున్న మనోజ్
  • లోన్ యాప్ రుణానికి ఈఎంఐ చెల్లించలేకపోవడంతో వేధింపులు
హైదరాబాద్ లో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. తీసుకున్న రుణానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. కుటుంబ సభ్యులు, బంధువులకు ఫోన్ చేసి చెప్పడంతో ఆవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తగూడెం పట్టణానికి చెందిన శీలం మనోజ్ దుండిగల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల లోన్ యాప్ ద్వారా కొంత మొత్తం లోన్ తీసుకున్నాడు. ఈ లోన్ ఈఎంఐ సకాలంలో చెల్లించలేకపోయాడు.

దీంతో లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేసి బెదిరింపులకు గురిచేయడంతో మనోజ్ ఆవేదనకు గురయ్యాడు. కుటుంబ సభ్యులకు, బంధువులు, స్నేహితులకు లోన్ యాప్ ఏజెంట్లు ఫోన్ చేశారు. ఈ విషయం తెలియడంతో పరువు పోయిందని మనస్తాపానికి గురైన మనోజ్ సోమవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. మనోజ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మనోజ్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
Loan APP
Student Suicide
Loan Recovery
Hyderabad
Loan APP Agents

More Telugu News