Aksha Pardasany: సినిమాటోగ్రాఫర్ కౌశల్‌ని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్ అక్ష

Aksha Pardasany weds with bollywood lover Kaushal
  • ముసాఫిర్ సినిమాతో బాలనటిగా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన అక్ష పార్దసాని
  • యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్ సినిమాల్లో నటించిన అక్ష
  • కెమెరా క్రేన్‌పై మండపంలోకి కౌశల్ వెరైటీ ఎంట్రీ 
  • గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్
‘ముసాఫిర్’ సినిమాతో 2004లో బాలనటిగా బాలీవుడ్‌లో ప్రవేశించి ఆపై తెలుగులో యువత, రైడ్, కందిరీగ, బెంగాల్ టైగర్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన నటి అక్షా పార్దసాని తన ప్రియుడు, బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు. గతేడాది నిశ్చితార్థం జరగ్గా నిన్న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.

పెళ్లి ఫొటోలను షేర్ చేసిన అక్ష.. తమ ప్రార్థనలు ఫలించాయని, తామిద్దరం ఒక్కటయ్యామని రాసుకొచ్చారు. దేవుడి దయతోపాటు ఇరు కుటుంబాల ఆశీస్సులు కూడా తమతోనే ఉంటాయని పేర్కొన్నారు. 8వ తరగతి చదువుతున్నప్పుడే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన అక్ష ఇప్పటి వరకు 75కు పైగా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో 16కుపైగా సినిమాల్లో ఆమె నటించారు. సినిమాటోగ్రాఫర్ అయిన కౌశల్ కెమెరా క్రేన్‌పై మండపంలోకి వెరైటీ ఎంట్రీ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Aksha Pardasany
Tollywood
Kaushal
Destination Wedding

More Telugu News