Aadhaar Card: లోక్‌సభ ఎన్నికల్లో ఓటేయాలంటే ఆధార్ అవసరమా?.. ఈసీ క్లారిటీ

Dont need Aadhar to cast vote in Lok Sabha elections
  • టీఎంసీ నేతల ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ
  • ఆధార్ లేకున్నా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని స్పష్టీకరణ
  • ఓటరు కార్డు, చెల్లుబాటు అయ్యే మరే గుర్తింపు కార్డు చూపించి అయినా ఓటు వేయవచ్చన్న ఈసీ
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఆధార్‌కార్డు ఉండాల్సిందేనంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) వివరణ ఇచ్చింది. అలాంటిదేమీ లేదని, ఆధార్ లేకున్నా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఓటరు కార్డు కానీ, లేదంటే, చెల్లుబాటు అయ్యే మరేదన్నా గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చని స్పష్టం చేసింది.

పశ్చిమ బెంగాల్‌లో వేలాది ఆధార్‌కార్డులను పనికిరాకుండా చేస్తున్నారంటూ అధికార తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ ప్రకటన చేసింది. ఆధార్ కార్డు లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోబోమని టీఎంసీ బృందానికి ఈసీ తెలిపింది.
Aadhaar Card
Voter ID
EC
CEC
Lok Sabha Elections 2024

More Telugu News