Virat Kohli: లండన్ రెస్టారెంట్ లో కూతురు వామికతో కోహ్లీ.. వైరల్ అవుతున్న ఫొటో

  • ప్రస్తుతం లండన్ లో ఉన్న కోహ్లీ
  • ఈ నెల 15న లండన్ లో కొడుక్కి జన్మనిచ్చిన అనుష్క
  • కూతురు వామికతో కలిసి లండన్ లో చక్కర్లు కొడుతున్న కోహ్లీ
Kohli and Vamika pic going viral

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ డెలివరీ నేపథ్యంలో ఆయన తన కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్ కు వెళ్లాడు. ఈ క్రమంలో, ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు కూడా దూరంగా ఉన్నాడు. ఈ నెల 15న లండన్ లోనే అనుష్క పండంటి కొడుక్కి జన్మనిచ్చింది. తమ కొడుక్కి కోహ్లీ, అనుష్క దంపతులు అకాయ్ అనే పేరు కూడా పెట్టారు. మరోవైపు లండన్ లో ఉన్న కోహ్లీ తన కూతురు వామికతో కలిసి అక్కడి వీధుల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా ఓ రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి ఫుడ్ లాగించారు. ఈ సందర్భంగా కొందరు వీరిని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Loading...

More Telugu News