Congress: బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌‌కు లీగల్‌ నోటీసు పంపిన కాంగ్రెస్‌

  • టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారు అందుకున్నారన్న ప్రభాకర్
  • 2 రోజుల్లో ఆధారాలు చూపకుంటే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించిన దీపాదాస్
  • నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం
Congress sent legal notice to BJP leader NVSS Prabhakar

కాంగ్రెస్‌ నాయకుల నుంచి టీపీసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్‌ మున్షీ బెంజ్‌ కారును అందుకున్నారంటూ తెలంగాణ బీజేపీ నేత ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌ చేసిన ఆరోపణలపై హస్తం పార్టీ స్పందించింది. ఆయనకు లీగల్ నోటీసులు పంపించింది. ఇక తనపై వచ్చిన ఆరోపణను దీపాదాస్ ఖండించారు. తనపై చేసిన ఆరోపణలకు సంబంధించి 2 రోజుల్లో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించకుంటే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని దీపాదాస్ మున్షీ ఖండించారు.

More Telugu News