TDP Janasena: టీడీపీ - జనసేన ఉమ్మడి సభ పేరు 'జెండా'

  • ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో బహిరంగసభ
  • పోస్టర్ ను విడుదల చేసిన టీడీపీ, జనసేన నేతలు
  • సభలో ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామన్న నాదెండ్ల మనోహర్
TDP Janasena rally name is Jenda

ఈ నెల 28వ తేదీన టీడీపీ - జనసేన పార్టీలు ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ సభ జరగనుంది. ఈ సభకు 'జెండా'గా నామకరణం చేశారు. సభకు సంబంధించిన పోస్టర్ ను టీడీపీ, జనసేన నేతలు ఆవిష్కరించారు. ఉమ్మడి సభ ఏర్పాట్లను ఇరు పార్టీల నేతలు నాదెండ్ల మనోహర్, ప్రత్తిపాటి పుల్లారావు, నిమ్మల రామానాయుడు, బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ... 'జెండా' ద్వారా ఉమ్మడి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. తాడేపల్లిగూడెంలో అద్భుతమైన సభను నిర్వహించనున్నామని తెలిపారు.

More Telugu News