YS Sharmila: కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించిన వైఎస్ షర్మిల

YS Sharmila announces first guarantee of Congress party

  • ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీని ప్రకటించిన షర్మిల
  • ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని హామీ
  • పేద కుటుంబాలు నిర్భయంగా బతికేందుకు తీసుకొస్తున్న పథకమని వ్యాఖ్య

ఏపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తొలి హామీని ప్రకటించింది. ఇందిరమ్మ అభయం పేరుతో తొలి గ్యారెంటీని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. ఈ పథకం కింద్ర ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ. 5 వేలు ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. అనంతపురంలో నిర్వహించిన న్యాయ సాధన సభలో ఆమె ఈ ప్రకటన చేశారు. మహిళల పేరు మీదే చెక్కు ఇస్తామని తెలిపారు. పేద కుటుంబాలు నిర్భయంగా బతికేందుకు, పేదరికం నిర్మూలన కోసం తీసుకొస్తున్న పథకం ఇందిరమ్మ అభయం పథకమని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దివంగత రాజశేఖరరెడ్డి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేశారని అన్నారు. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు. 

ఇతర రాష్ట్రాలు అభివృద్ధిలో వేగంగా దూసుకుపోతున్నాయని... చంద్రబాబు, జగన్ ల పదేళ్ల పాలనలో ఏపీ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని షర్మిల విమర్శించారు. పదేళ్లలో పట్టుమని 10 ఉద్యోగాలు కూడా రాలేదని అన్నారు. ప్రత్యేక హోదా జగన్ తోనే సాధ్యమని ప్రజలు నమ్మితే... అధికారాన్ని అనుభవిస్తూ ఆయన ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు. వైసీపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయలేదని, రాజీనామాలు చేయలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏనాడూ ప్రశ్నించే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. 

  • Loading...

More Telugu News