Hyper Aadi: 2019లో పవన్ కల్యాణ్ ను గెలిపించుకోలేని మనకు.. ఆయనను అడిగే హక్కు ఎక్కడిది?: హైపర్ ఆది

What right we have to question Pawan Kalyan asks Hyper Aadi

  • 24 సీట్లు మాత్రమే తీసుకున్నారంటూ పవన్ పై సొంత అభిమానుల విమర్శలు
  • కోట్లు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తి పవన్ అన్న ఆది
  • మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడొద్దని హితవు

జబర్దస్త్ షో ద్వారా క్రేజ్ సంపాదించుకున్న హైపర్ ఆది... టాలీవుడ్ లో సైతం స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నాడు. జనసేనాని పవన్ కల్యాణ్ కు హైపర్ ఆది బిగ్ ఫ్యాన్ అనే విషయం తెలిసిందే. ఎన్నో సందర్భాల్లో జనసేన కార్యకర్తగా ఆయన ప్రసంగాలు చేశాడు. పవన్ ను ఎవరైనా ఒక్క మాట అన్నా... వారికి తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడడు. తాజాగా టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లను కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్ పై ఆయన అభిమానులు కూడా విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైపర్ ఆది స్పందిస్తూ... పవన్ అమ్ముడుపోయే వ్యక్తి కాదని అన్నారు. సినిమాల్లో కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తి అని చెప్పాడు. 

కేవలం 24 సీట్లకే తలొగ్గడం ఏమిటని పవన్ గురించి మాట్లాడుతున్నారని... 2019లో ఆయనను గెలిపించుకోలేని మనకు ఆయన గురించి మాట్లాడే హక్కు ఉందా? అని హైపర్ ఆది ప్రశ్నించాడు. సొంత కష్టార్జితంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ అని కొనియాడాడు. రోజుకు రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసకునే పవన్... సంపాదన మొత్తాన్ని సహాయ కార్యక్రమాలకు పెట్టేసి... ఇప్పుడు దాదాపుగా అప్పు చేసి పార్టీని నడుపుతున్నారని చెప్పాడు. చిన్న పరీక్షలో ఫెయిల్ అయతేనే మనం పది రోజులు బయటకు రాలేమని... అలాంటిది రెండు చోట్ల ఓడిపోయినా రెండో రోజే కౌలు రైతుల కష్టాలు తీర్చిన గొప్ప మనసు పవన్ దని కొనియాడాడు. 

కులాన్ని, పార్టీని తాకట్టు పెట్టారని, ప్యాకేజీ తీసుకున్నాడని చాలా ఈజీగా కామెంట్ చేస్తున్నారని... ఇలాంటి మాటలు ఎందుకని హైపర్ ఆది అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కంటే అధికారంలో ఉన్న వైసీపీ వద్ద ఎక్కువ డబ్బు ఉందని... అలాంటప్పుడు వైసీపీ దగ్గరకు పవన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించాడు. అభిమానించడం అంటే మనకు అనుకూలంగా ఉన్నప్పుడు జై కొట్టడం... అనుకూలంగా లేనప్పుడు బై చెప్పడం కాదని  అన్నాడు. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండటాన్నే అభిమానం అంటారని చెప్పారు. మన నాయకుడిని తక్కువ చేసి మాట్లాడకూడదని హితవు పలికాడు.

  • Loading...

More Telugu News