Harish Rao: తెడ్డు తిప్పడం చేతకాని సన్నాసి పదేళ్లు మంత్రిగా ఎలా ఉన్నాడు?: హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

Revanth Reddy hot comments on Harish rao
  • సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
  • మేం అంతా వడ్డించాక కాంగ్రెస్ వచ్చి తెడ్డు తిప్పిందన్న హరీశ్ రావు వ్యాఖ్యలకు కౌంటర్
  • కోర్టుల పరిధిలో ఉన్న పలు విషయాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్లిష్టం చేసిందని ఆరోపణ
మాజీ మంత్రి హరీశ్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేం పూర్తిగా వండి సిద్ధంగా పెడితే కాంగ్రెస్ వచ్చి తెడ్డు తిప్పిందని హరీశ్ రావు అన్నారు. ఈ వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి కౌంటర్ ఇచ్చారు. సచివాలయంలో సింగరేణి ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... "మేం అంతా వండాక కాంగ్రెస్ వచ్చి తెడ్డు తిప్పిందని అంటున్నారని... ఆ తెడ్డు కూడా తిప్పడం చేతకాని సన్నాసి హరీశ్ రావు పదేళ్లు మంత్రిగా ఎలా ఉన్నాడు? ఇన్ని చేసిన వాళ్లు ఆ తెడ్డు కూడా తిప్పవచ్చు కదా?" అని వ్యాఖ్యానించారు. ఇన్ని చేసిన బీఆర్ఎస్‌ను ఆ ఒక్క పని చేయగా ఎవరైనా వద్దన్నారా? అని ఎద్దేవా చేశారు.

కోర్టుల పరిధిలో ఉన్న పలు విషయాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించలేదని, పైగా వాటిని సంక్లిష్టం చేసిందని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. సింగరేణిలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను తాము చేపట్టామన్నారు.
Harish Rao
Telangana
Congress

More Telugu News