TS 10th Exams: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

  • మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు
  • ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు
  • ఉత్తర్వులు జారీ చేసిన బోర్డు అధికారులు
Telangana 10th exams schedule released

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయి.   

పదో తరగతి పరీక్షల షెడ్యూల్:

  • మార్చి 18 - ఫస్ట్ లాంగ్వేజ్
  • మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్
  • మార్చి 21 - థర్డ్ లాంగ్వేజ్
  • మార్చి 23 - గణితం
  • మార్చి 26 - ఫిజిక్స్
  • మార్చి 28 - బయాలజీ
  • మార్చి 30 - సోషల్ స్టడీస్.

More Telugu News