Telangana: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

  • 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఔట్‌ల క్రమబద్ధీకరణకు అవకాశమివ్వాలని నిర్ణయం
  • మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణకు అవకాశమివ్వాలని నిర్ణయం
  • దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములు తప్ప ఇతర లేఔట్‌ల క్రమబద్ధీకరణకు ఓకే
Telangana Government key decision on LRS applications

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో స్వీకరించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకు సంబంధించి లేఔట్‌లు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని నిర్ణయించింది. మార్చి 31వ తేదీ లోపు దరఖాస్తుదారులకు క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దేవాదాయ, వక్ఫ్, ప్రభుత్వ భూములు, కోర్టు ఆదేశాలు ఉన్న భూములను తప్ప ఇతర లేఔట్‌లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 20 లక్షల మంది దిగువ, మధ్య తరగతికి చెందిన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూరనుంది.

More Telugu News