Etela Rajender: అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు: ఈటల రాజేందర్

  • లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని ధీమా
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే మా ఓటు అని ప్రజలు కూడా అంటున్నారని వ్యాఖ్య
  • మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం మచ్చ లేకుండా సాగుతోందన్న ఈటల
Etala Rajender reveals why congress won in TS elections

బీఆర్ఎస్ పైనా, కేసీఆర్‌పైనా కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం ఆయన గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడుతూ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకే మా ఓటు అని ప్రజలు కూడా చెబుతున్నారన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎలాంటి మచ్చ లేకుండా ఎన్డీయే ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.

గతంలో యూపీఏ పాలనలో ఎక్కడ చూసినా అవినీతే కనిపించేదన్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదే అన్నారు. పది లక్షల మంది మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు, యువత అంతా కలిసి మరోసారి మోదీని గెలిపించుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.

More Telugu News